రాయదుర్గం: వైభవంగా తారకాపురం కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి రథోత్సవం
బొమ్మనహాళ్ మండలం తారకాపురం గ్రామంలో వెలసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి రథోత్సవం మంగళవారం సాయంత్రం గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం గంగాజలం తెచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 101 మంది గొరవయ్యల నృత్యం, నందికోల వీరభద్ర కుణితం, మహిళా విరకాశి నృత్యాల మధ్య శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవాన్ని వేలాది మంది భక్త జన సందోహం మద్య ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.