మార్కాపురం: పొదిలిలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ప్రజలతో ఆమె నేరుగా మాట్లాడి అర్హులైన ప్రతి ఓటరు తమకందిన ధ్రువీకరణ ఫారాన్ని పూర్తిచేసి నింపి అవసరమైన జిరాక్స్ పత్రాలతో జూలై 14వ తేదీ లోపు సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా గడువులోపు అన్ని దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు.