మార్కాపురం: మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో 35 వార్డుల నుండి 40 వార్డులుగా పెంపు, అభ్యంతరాలు తెలపాలని కమిషనర్ నారాయణ రావు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న 35 వార్డులను పెంచుతూ 40 ఎన్నికల వార్డులుగా విభజించినట్లు కమిషనర్ నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత నలభై వార్డుల సరిహద్దులు వివరాలను ప్రకటించడం జరిగిందన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల లోపల రాతపూర్వకంగా పురపాలక సంఘ కమిషనర్ కి సమర్పించాలని ప్రజలను కోరారు.