గిద్దలూరు: గిద్దలూరు మండలం జయరామపురం గ్రామంలో ధర్మరాజు అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి, ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం జయరామపురం గ్రామంలో ధర్మరాజు అనే ఉపాధి కూలీ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కూలి పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిన క్రమంలో ధర్మరాజు అపస్మార్క స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. గ్రామస్తులు అందరూ వడదెబ్బతో మృతి చెందినట్లు చెబుతుండగా అధికారులు మాత్రం ధర్మరాజు గుండెపోటుకు గురైనట్లు చెబుతున్నారు. గ్రామస్తులు ధర్మరాజు కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.