కనిగిరి: చంద్రశేఖరపురం మండలం పెద్ద గోగులపల్లి గ్రామంలో జరిగిన హత్య ఘటనపై క్లూస్ టీమ్ ని రంగంలోకి దించిన పోలీసులు
మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం పెద్ద గోగులపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ సర్పంచ్ రెండవ కుమారుడు బాబు అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. శనివారం స్థానిక సీఐ వినోద్ కుమార్ క్లూస్ టీంని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.