తాడిపత్రి: ఆలూరు కోనలో అత్యంత ఘనంగా శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రి మండలం ఆలూరు కోనలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రంగనాథ స్వామికి బుధవారం రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాల నుంచి పూజలు చేశారు. రాత్రి 11 గంటల దాకా విశేష పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.