దర్శి: కురిచేడు మండలం రామాంజనేయ కాలనీకి చెందిన వలస కూలీలకు గుర్తింపు కార్డులు అందజేసిన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి
Darsi, Prakasam | Apr 24, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవుల మంద పంచాయతీలోని రామాంజనేయ కాలనీకి చెందిన వలస కూలీలకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గుర్తింపు కార్డులు అందజేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ లో వెట్టిచాకిరి చేస్తూ నిరాశ్రయులుగా మారిన వారికి అండగా నిలుస్తూ దళిత సాధికారత ప్రతినిధి నాగమణి, ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తర్వాత వలస కూలీలను వారి స్వగ్రాముల కు రప్పించారు. వలస కూలీలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ అన్నారు.