మార్కాపురం: విద్యార్థినిని బెదిరించి బంగారు నగలు దోచుకున్న ప్రైవేట్ లెక్చరర్ ను అరెస్టు చేసినట్లు తెలిపిన డిఎస్పి నాగరాజు
మార్కాపురం సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ... ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ విద్యార్థినిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకున్నారని తెలిపారు. పరీక్షల్లో మార్కులు తగ్గిస్తానని లేదా ఫెయిల్ చేస్తానని పలు దశలుగా బెదిరించి విద్యార్థిని వంటిపై ఉన్న బంగారు నగలను తీసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లెక్చరర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న సుమారు 54 గ్రాములు బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.