రాయదుర్గం: పట్టణంలోని ఊరువాకాలి వద్ద పీర్ల పండుగ వివాదం, ఉద్రిక్తత
రాయదుర్గం కోట ఊరువాకిలి వద్ద ఆదివ పండుగపై వివాదం తలెత్తింది. పీర్లను కొలువుదీర్చేందుకు స్థలం శుభ్రం చేస్తుండగా హెరిటేజ్ అసోసియేషన్, విహెచ్‌పి నేతలు అభ్యంతరం తెలిపారు. ఇది 90 లక్షలతో జీర్ణోద్ధరణ అవుతున్న చారిత్రక ప్రదేశమని, ఇకపై ఈ పండుగ ఇక్కడ వద్దని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జరుపుకుంటున్నామని పీర్ల చావిడి వారు వాదించారు. ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి సర్దిచెప్పారు. చర్చలు కొనసాగుతున్నాయి.