మార్కాపురం: కొండారెడ్డి కాలనీలో మల్లికార్జున స్వామి గాయత్రి దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
మార్కాపురం కొండారెడ్డి కాలనీలోని గురు శంకరా గాయత్రి జ్ఞాన ధామంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, గాయత్రి, దక్షిణామూర్తి, ఆది శంకరచార్య ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గవ్యాంత పూజలు దీక్షహోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణహుతి కలశోద్వాసన కళాన్యాసము కుంభము దృష్టి గోవు సర్వదర్శనము శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓరుగంటి మల్లిక్ తెలిపారు.