మార్కాపురం: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో తిరిగి పరిశీలించారు. ప్రజలకు అందజేస్తున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని ఎక్కడున్నా పేషంట్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో ప్రజలకు వైద్య సదుపాయం అందించాలని సూచించారు.