దర్శి: దర్శి ముండ్లమూరు ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టిన ఏడుకొండలు కోటేశ్వరరావు
ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐగా ఏడుకొండలు ముండ్లమూరు ఎస్సైగా కోటేశ్వరరావు నూతన బాధ్యతలు చేపట్టారు. దర్శి లో ఎస్సైగా పనిచేసిన మురళికి సీఐ పదోన్నతి పై బదిలీ అయ్యారు. అదేవిధంగా ముండ్లమూరులో పనిచేస్తున్న ఎస్ఐ కమలాకర్ సీఐ పదోన్నతితో బదిలీపై వెళ్లారు. ఆ స్థానాలలో ఎస్సైలు ఏడుకొండలు కోటేశ్వరరావును నియమిస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇరువురు నూతన బాధ్యతలు స్వీకరించారు.