కొండపి: ఈదరమూడి లో జూలై 7న పుణ్యక్షేత్రం శంకుస్థాపన కార్యక్రమం: ఎమ్మార్పీఎస్ నేత రావినూతల కోటి
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమ పురిటిగడ్డ జూలై 7న ఈదుమూడిలో నిర్వహించ తలపెట్టిన 'మాదిగల పుణ్య క్షేత్రం' శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ అధినేత బ్రహ్మన్న ఆదేశాల మేరకు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కొండపి నియోజకవర్గ సమావేశం శింగరాయకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పలువురు ఉన్నారు.