కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రైతుల వద్ద నుంచి 253 పొగాకు బేళ్లు కొనుగోలు తిరిగినట్లు అధికారులు వెల్లడి
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో శనివారం కొనుగోళ్ల తీరును సింగరాయకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ నిర్మల కుమారి పరిశీలించారు. ముప్పవరం, చోడవరం గ్రామాలకు చెందిన రైతులు 412 బేల్లు అమ్మకానికి తీసుకురాగా 253 బేళ్లుమాత్రమే కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 159 బెళ్లను తిరస్కరించారు. ఒకవైపు రైతులు రైతు ప్రతినిధులు రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తిరస్కరణ సంఖ్య ఆగట్లేదని రైతులు వాపోతున్నారు.