మార్కాపురం: ఎమ్మార్వో కార్యాలయంలో కృష్ణాపురం కు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ఎమ్మార్వో కార్యాలయంలో కృష్ణాపురం కు చెందిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. రీ సర్వేలో భాగంగా ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో రామచంద్రాపురం గ్రామ రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు