గిద్దలూరు: అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో మైనర్ బాలుడు అనుమానస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో మైనర్ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మైనర్ బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బాలుడు మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం తరలించారు.