ఉరవకొండ: గంగవరం రంజాన్ వేడుకల్లో పాల్గొన్న పీఏసీ మెంబర్ ఉరవకొండ సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామంలో ముస్లిం సోదరులు శనివారం ఏర్పాటు చేసిన రంజాన్ పండుగ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు నాయకులతో పాటు వైయస్సార్సీపి పిఎసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. వై విశ్వేశ్వర్ రెడ్డికి ముస్లిం సోదరులు దుశ్యాలువాలతో సన్మానించి పండ్లను అందించారు. పవిత్ర రంజాన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొనడం ముస్లిం సోదర సోదరీమణులు సంతోషాన్ని నింపింది.