కొండపి: పొన్నలూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
పొన్నలూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయంపై ఆ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చని మాస్టర్ ట్రైనర్ బి. ఎస్తేరమ్మ అన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం అన్ని రకాలుగా రాయితీలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పుల్లారావు, ఎంపీడీవో సుజాత పాల్గొన్నారు.