మార్కాపురం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను కలిసిన వైపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు వసతి గృహంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ సభ్యులు డాక్టర్ గౌతమ్ రాజ్ రామంజమ్మ పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు వారితో బేటి అయ్యారు. అనంతరం ప్రాంతీయ సమస్యలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.