యర్రగొండపాలెం: టిడిపి కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జ్ ఎరిషన్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల క్లస్టర్ యూనిట్ ఇన్చార్జీలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రాధాన్యత, ఓటర్ జాబితా పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ పై సమగ్ర అవగాహన కల్పించినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు.