మార్కాపురం: జిల్లా కేంద్రంలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టడానికి చూస్తుందని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, ఈపీఎఫ్, హెల్త్ కార్డ్స్ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు.