గిద్దలూరు: బేస్తవారిపేటలో చెత్త సేకరించే రిక్షాలతో పాటు స్వచ్ఛ రథలు ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం చెత్త సేకరించే రిక్షాలతో పాటు స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి వచ్చి పారిశుద్ధ్య కార్మికులు చెత్తని సేకరిస్తారని ప్రజలు తడి చెత్త పొడి చెత్త విడిగా వేసి కార్మికులకు సహకరించాలన్నారు. అలానే వేస్ట్ పదార్థాలు పడవేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని అలానే వాటిని స్వచా రథాలలో ఇచ్చి తమ కావాల్సిన నిత్యవసర వస్తువులు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.