రాయదుర్గం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఒకేరోజు శ్యానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ : జిల్లా కలెక్టర్ ఆనంద్
జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో ఒకేరోజు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. శనివారం రాయదుర్గం చెత్త కంపోస్ట్ యార్డ్ కు చేరుకుని చెత్త వేరుచేసే విధానం పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పారేయొద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఖాళీ స్థలాలలో చెత్త ను వేసి అపరిశుభ్రంగా మారిస్తే స్థలం యజమానులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్చ పట్టణాలుగా మార్చేందుకు వీలవుతుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.