రాయదుర్గం: సర్ ఓటరు నమోదు లో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి : మెట్టు గోవిందరెడ్డి
సర్ ఓటరు నమోదులో YCP నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా BLA లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని BLA లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై సమీక్షించారు. పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని, లీడర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఫారాలు అందజేయాలని సూచించారు. మండల అధ్యక్షుడు రామాంజనేయులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.