తాడిపత్రి: ఆలూరు కోన క్షేత్రంలో అత్యంత వైభవంగా రంగనాథ స్వామి రథోత్సవం, ప్రత్యేక పూజలు
తాడిపత్రి మండలం ఆలూరు కోన క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విశేష పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రంగనాథ స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు. జై రంగనాథ స్వామి నినాదాలు తో ఆలూరు కోనక్షేత్రం మారుమోగిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.