యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎలక్షన్ బాబు, సమస్యలపై అర్జీలు స్వీకరణ
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అన్నారు. శనివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఇన్ ఛార్జ్ నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై ఎరిక్షన్ బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. వచ్చిన అర్జీలను పరిశీలించిన ఆయన తక్షణమే కొన్నిటిని పరిష్కరించడం జరిగింది. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆయన అన్నారు.