మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కి ముందు భాగం అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు ఆందోళన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి మార్కాపురం నుండి బెంగళూరు వెళ్తున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రావెల్స్ ఏసి స్లీపర్ బస్సు డ్రైవర్ కి ముందు ఉన్న అద్దం పగిలిపోయింది. దానివల్ల ప్రయాణం సేఫ్ కాదని ట్రావెల్ యజమానిని బస్సు మార్చమని ప్రయాణికులు అడగగా కడప వరకు రండి అక్కడ నుండి మారుస్తామని వారు సమాధానమిచ్చారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సును ఏ విధంగా ఏర్పాటు చేస్తారని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు. అప్పటికే కొందరు ప్రయాణికులు రిటన్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు.