కొండపి: టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటోని వెనక నుంచి ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లా టంగుటూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం ఆటోని ద్విచక్ర వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడుకి తీవ్రంగా గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో స్థానికులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి ఎర్రగొండపాలెం కు చెందిన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు.