రాయదుర్గం: రాయలసీమ ద్రోహులు వైసిపి నేతలు : పట్టణంలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి
YCP నేతలు రాజకీయ నిరుద్యోగులుయ్యాక రాయలసీమ ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయని R&B శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాయదుర్గంలో MLA లు కాలవశ్రీనివాసులు, జెసి అస్మిత్ రెడ్డి, దగ్గుబాటి ప్రసాద్ తో కలసి మీడియాతో మాట్లాడారు. వారు అధికారంలో ఉన్నరోజుల్లో ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. నిజమైన ద్రోహులు మీరేనని ద్వజమెత్తారు. చంద్రబాబు తోనే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.