కళ్యాణదుర్గం: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళద్దండి: కళ్యాణదుర్గంలో డీఎస్పీ రవిబాబు
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ప్రజలు, యువకులకు సూచించారు. కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ కాలనీలో శనివారం పోలీసులు ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమంలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కాలనీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి యువత తమ భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అంతేకాకుండా విచక్షణ కోల్పోతారన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.