మార్కాపురం: నాగేళ్ల ముడిపి గ్రామంలో పర్వత వర్ధిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నాగేల్లముడిపి గ్రామంలో వెలిసిన పర్వత వర్ధిని దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ప్రాదోషకాలంలో గణపతి పూజ, రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీ చక్రార్చన, మహా నివేదన, మంగళ హారతి తదితర పూజలు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు