మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావస కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు
మార్కాపురం మండలం వేములకోట వద్ద వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన గొట్టిపాడియ అక్కచెరువు గ్రామాల్లోని కొంతమందికి ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు పునరావస కాలనీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిమెంట్ రోడ్లు కాలువలు ఏర్పాటు చేశారు. పాఠశాల భవనం, వాటర్ ట్యాంక్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చిల్లకంపలతో చిట్టాడవిని తలపిస్తుంది