దర్శి: దర్శి మున్సిపల్ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డ స్థానిక ప్రజలు
Darsi, Prakasam | Mar 31, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నందు సర్వర్ పని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. ఇంటి పన్ను తదితర బకాయిలు చెల్లించుటకు ఇవాళ చివరి రోజు కావటంతో కార్యాలయానికి వచ్చిన వారికి సర్వర్ ఇబ్బందులు తప్పలేదు. గత 15 రోజులుగా ఇంటి పన్ను చెల్లించాలని అవగాహన కల్పిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు. చివరి రోజు ఈ విధంగా జరగడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.