మార్కాపురం: జిల్లా కేంద్రంలోని 13 వ వార్డులో పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ ప్రతినెల 1వ తేదీన ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు