గిద్దలూరు: గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పెద్దచెరువు గ్రామంలో ఆదివారం అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.