రాయదుర్గం: పట్టణంలోని చెత్త కంపోస్టు డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
రాయదుర్గం పట్టణంలో పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను శుద్దిచేసి ఎరువుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు తెలిపారు. శనివారం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పలువురు టిడిపి నాయకులతో కలిసి పట్టణంలోని చెత్త కంపోస్టు డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారని వివరించారు. ఇందుకోసం రూ. 8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.