గిద్దలూరు: బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక, ప్రాంతాలను పరిశుభ్రం చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గురువారం గుర్తించి పోలీసులు పరిశుభ్రం చేశారు. అలానే ఆ సమయంలో మద్యం తాగుతున్న వారిని గుర్తించిన పోలీసులు వారికి జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో వారిని శుభ్రం చేసేలా చూశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిఘా ఉంచి ఆ ప్రాంతంలో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.