తాడిపత్రి: గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసిన చర్యలు తీసుకుంటాం:తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయించినా, అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన మాట్లాడారు. ఈరోజు ఓ వ్యక్తి వెంకటాంపల్లి గ్రామ సమీపంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు బ్లాక్ లో విక్రయిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.