యర్రగొండపాలెం: పుచ్చకాయల పల్లి గ్రామంలో నిరుపయోగంగా మారిన చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయల పల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో తడి పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా విలువైన ఉత్పత్తులను తయారు చేసేందుకు 2018 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేశారు. నేడు కేవలం చెత్త కేంద్రాలుగానే మిగిలిపోయాయి. వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు