యర్రగొండపాలెం: మేడేపి టోల్ ప్లాజా పైన ఉన్న కప్పు గాలుల దాటికి ఎగిరి పడిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద సోమవారం వేసిన ఈదురు గాలులకు భారీ ప్రమాదం తప్పింది. గాలుల దాటికి టోల్ ప్లాజా పై ఉన్న రేకుల షెడ్డు ఏకంగా 100 మీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరి అవతల పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడెవరు లేకపోవడంతో ఇటువంటి ప్రాణా నష్టం జరగలేదు. ఈదురుగాలుల తీవ్రతకు రేకుల షెడ్డు ఎగిరి పడిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.