రాయదుర్గం: కణేకల్లులో ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళుతున్న బ్యాంక్ ఉద్యోగిని సత్కరించి వీడ్కోలు పలికిన రైతులు
రైతులకు ఉత్తమ సేవలు అందించి బదిలీపై వెళుతున్న బ్యాంక్ ఉద్యోగిని రైతులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కణేకల్లు మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఉద్యోగి బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న రైతులు బ్యాంక్ వద్దకు వెళ్లి ఆ ఉద్యోగి సేవలు గుర్తు చేసుకుని శాలువాలతో సత్కరించి పూలమాలతో వీడ్కోలు పలికారు. రైతు సంఘం అధ్యక్షులు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా రైతుల క్రాప్ లోన్ మంజూరు, రెన్యూవల్ సమయంలో ఆమె ఎంతో ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు. దీనికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.