ఉరవకొండ: టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలి: బెలుగుప్పలో వైసీపీ జిల్లా అధికారి ప్రతినిధి వీరన్న
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న డిమాండ్ చేశారు. బెలుగుప్పలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆయన మాట్లాడారు. బీ ఆర్ నాయుడు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. బీ ఆర్ నాయుడును తొలగించే వరకు ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.