మార్కాపురం: జిల్లా కేంద్రంలో చివరి రోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా రాసిన విద్యార్థులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి 8 గంటలకే చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలని పరీక్ష కేంద్రం వద్ద వదిలి వెళ్లారు. విద్యార్థులు ఉత్సాహంగా చివరి రోజు పరీక్ష రాశామని ఆనందం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు కట్టుదట్టమైన చర్యలు చేపట్టారు.