కొండపి: జరుగుమల్లి మండలం పాలేరు సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికీ గాయాలు, ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి ఒక చెయ్యి పూర్తిగా శరీరం నుంచి వేరైంది. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ కూడా ఓ మోస్తరు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.