యర్రగొండపాలెం: పాత అన్న సముద్రం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామ ప్రజలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటు చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారు 50 ఎకరాల పొలాన్ని ఇతరులు కొనుగోలు చేసి చేపల చెరువు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమీపంలోనే గ్రామానికి చెందిన చెరువు ఉండడంతో నీరు కలుషితమవుతుందని ప్రజలు ఇబ్బందులు పడతారని వారన్నారు. చాపల చెరువు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.