యర్రగొండపాలెం: డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిమాండ్
డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయంలో అధికారులను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిలదీసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో సూట్ కేసుల పరిపాలన జరుగుతున్నట్లు కనిపిస్తుందని నీరో చక్రవర్తి తరహాలో రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే నారా చక్రవర్తులు మహానాడులో ఫిడెల్ వాయించుకుంటున్నారని విమర్శించారు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి టెట్ కన్వీనర్ ఉన్న తొలగించకుండా విద్యాశాఖలో జెడిగా ఉన్న తమకు వ్యక్తిని కొనసాగించారన్నారు.