రాయదుర్గం: కణేకల్లు విఆర్ఓ ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కనేకల్లు మండలం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులుగా K.P. నాగిరెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ బ్రహ్మయ్య సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా నాగిరెడ్డి ఎన్నికకాగా కార్యదర్శి గా M.రుద్రప్ప, కోశాధికారిగా M.పర్వీన్, ఉపాధ్యక్షులుగా M.కుళ్ళాయిస్వామి, సంయుక్త కార్యదర్శిగా M. రామ్మూర్తిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తహశీల్దార్ బ్రహ్మయ్య అభినందనలు తెలియజేశారు. హక్కులు, సంక్షేమం కోసం పాటుపడుతూ కణేకల్ మండల ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.