తాడిపత్రి: చిరు వ్యాపారస్తులకు టౌన్ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే లోన్స్ ఇప్పిస్తాం:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి లోని చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారు వ్యాపారాలు చేసుకోవడానికి టౌన్ బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి లోన్స్ ఇప్పిస్తామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన మాట్లాడారు. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటున్నారన్నారు. బ్యాంకు ద్వారా రూ.1.15 వడ్డీకే లోన్స్ ఇస్తామన్నారు. చిరు వ్యాపారులు తమను సంప్రదించాలని కోరారు.