కొండపి: జరుగుమల్లి మండలం చింతలపాలెం లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. ముందుగా తడి చెత్త పొడి చెత్త సేకరించే డస్ట్ బిల్లులను ఆవిష్కరించారు. తర్వాత పలు అభివృద్ధి పనులలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలను ప్రజలకు వివరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు ప్రజాప్రతినిధుల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు.