కనిగిరి: కనిగిరిలో వృధాగా పోతున్న నీరు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని కందుకూరు రోడ్డులో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా కొన్నిచోట్ల నీళ్ల పైపులు పగిలిపోయాయి. గత వారం రోజులుగా నీరు వృథాగా పోతోందని స్థానికులు అన్నారు. అసలే ఎండాకాలం కావడంతో శంకవరం, చింతలపాలెం, పాతశంఖవరం ప్రజలకు నీళ్లు ఇబ్బందిగా మారాయి. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.